16 రోజులైనా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నార్సింగి పోలీసులను నిలదీసిన మాధురి రాథోడ్!
Published on: 07 Sep 2026, 03:20 PM
హైదరాబాద్, సెప్టెంబర్ 7, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఈశ్వర్ సాయి కేసులో బాధితురాలు మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫిర్యాదు చేసి 16 రోజులు గడుస్తున్నా నిందితుడు ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆమె పోలీసులను తీవ్రంగా నిలదీశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నార్సింగి పోలీసులు రాబోయే 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయితో పాటు ఆయన భార్య శరణ్య, సంధ్యా రాణిపై మరో కొత్త కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.