24 గంటల్లోనే కూకట్‌పల్లి దోపిడీ కేసును చేధించిన పోలీసులు..
Published on: 17 Mar 2026, 03:21 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి ఏసీపీ ఆఫీస్ సమీపంలో నిన్న జరిగిన సంచలన కోటి రూపాయల దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ దోపిడీ వెనుక బయటి వ్యక్తులు మాత్రమే కాదు, బాధితుడితో పాటే ఉన్న సహోద్యోగి 'మాస్టర్ మైండ్' అని తేలడం సంచలనం రేపుతోంది.
దోపిడీ వెనుక ఉన్న అసలు కథ:
ప్లాన్ వేసింది ఇక్కడే: ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి మహ్మద్ ఖుస్రూద్దీన్ (A4). ఇతను బహదూర్‌పురాలోని సిద్రా ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. తన యజమాని తరచుగా హవాలా నగదును పది రూపాయల నోటును 'టోకెన్'గా ఉపయోగించి చేరవేస్తాడనే విషయాన్ని గమనించిన ఖుస్రూద్దీన్, ఆ డబ్బును కొట్టేయాలని ప్లాన్ వేశాడు.
మిత్రుడితో మంత్రాంగం: ఇందుకు డ్రైవర్‌గా పనిచేసే ఒమర్ షరీఫ్ (A1) సహాయం కోరాడు. 17వ తేదీన కోటి రూపాయల సేకరణ ఉందని తెలుసుకున్న ఖుస్రూద్దీన్, ఆ సమాచారాన్ని వెంటనే తన అనుచరులకు చేరవేశాడు.
సినిమా ఫక్కీలో అటాక్: ఖుస్రూద్దీన్, అజీముద్దీన్ అనే మరో వ్యక్తితో కలిసి నగదు తీసుకుని వస్తుండగా.. పిలర్ నంబర్ 836 వద్ద ఒమర్ షరీఫ్ బృందం కళ్లలో కారం కొట్టి నగదు ఉన్న బాక్సుతో పరారయ్యారు. కారం చల్లడంతో ఖుస్రూద్దీన్ తన బైక్‌ను బస్సుకు ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు.
పోలీసులు పట్టుకుంది ఇలా:
ఘటనా స్థలంలో నిందితులు ఒక హోండా యాక్టివా (TG 09 C 3987) బైక్‌ను వదిలేసి వెళ్లారు. దాని నంబర్ ఆధారంగా విచారించగా అది సద్దాం (A2) తల్లి పేరిట ఉన్నట్లు తెలిసింది. నిందితులు లక్నోకు పారిపోయేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు, వెంటనే అక్కడికి చేరుకుని ఒమర్ షరీఫ్, హమీద్, సద్దాంలను అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్య వివరాలు:
అరెస్టయిన వారు: ఏ1 - ఒమర్ షరీఫ్, ఏ2 - గౌస్ సద్దాం, ఏ3 - అబ్దుల్ హమీద్, ఏ4 - మహ్మద్ ఖుస్రూద్దీన్.
పరారీలో ఉన్నవారు: చోటు, సల్మాన్, గౌస్, జీషన్, జమ్ము.
రికవరీ: రూ. 77,78,195 నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక హోండా యాక్టివా, లక్నోకు బుక్ చేసిన ఫ్లైట్ టికెట్లు.
పోలీసుల అభినందన:
కూకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించాయి. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించిన కానిస్టేబుల్ వైభవ్‌ను, కేసును 24 గంటల్లో ఛేదించిన టీమ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.