అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు!

Published on: 09 Apr 2026, 05:32 AM
News Article

సంగారెడ్డి: ఏప్రిల్ 09 (హైదరాబాద్ న్యూస్ టైమ్) సంగారెడ్డి జిల్లాలో నాగరిక సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద గ్రామంలో ఒక అంగన్‌వాడీ టీచర్‌ను గ్రామస్తులు తాళ్లతో చెట్టుకు కట్టేసి అవమానించారు. హెచ్‌బీఎం ఫైనాన్స్‌ పేరుతో ఆమె భర్త ప్రభాకర్‌ గ్రామంలో పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. భర్త చేసిన మోసానికి భార్య అయిన అంగన్‌వాడీ టీచర్‌ వసంత కుమారిని బాధ్యురాలిని చేస్తూ గ్రామస్తులు ఈ అమానుషానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి, నిందితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.