అంగన్‌వాడీ పోషకాహార ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల.. గర్భిణీ కుటుంబం షాక్!

Published on: 08 Jun 2026, 04:10 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, పంధుర్నా, జూన్ 08, 2026: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహార పదార్థాల నాణ్యత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టే ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం కింద పంపిణీ చేసిన లడ్డూల ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని పంధుర్నా జిల్లా కార్ఘాట్ కమ్టీ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వత్సలా బాయి ధుర్వే అనే గర్భిణీకి స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది లడ్డూల ప్యాకెట్‌ను అందజేశారు. ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ పోషకాహార ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులో చనిపోయి ఉన్న పాము పిల్ల కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లడ్డూల తయారీ, ప్యాకింగ్ విధానంలో అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.