అక్రమ ప్రాజెక్టులపై గొంతు విప్పే ధైర్యం ఉందా? రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత సవాల్
Published on: 25 Jun 2026, 05:34 AM
హైదరాబాద్, జూన్ 25 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే చిత్తశుద్ధి, శక్తి ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలని ఆమె సవాల్ విసిరారు. తెలంగాణను ఎడారిగా మార్చే ఆ ప్రాజెక్టుల అంశంపై హోస్పేట్ వేదికగా రేవంత్ రెడ్డి గొంతు విప్పాలని, అలాగే కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను కూడా ఏమాత్రం రాజీ లేకుండా వ్యతిరేకించాలని ఆమె డిమాండ్ చేశారు.