అట్టహాసంగా మునుగోడు పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

Published on: 10 Aug 2026, 01:21 PM
News Article

మునుగోడు, ఆగస్ట్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మునుగోడు పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ ఆవరణలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తిని సత్యనారాయణ, కార్యదర్శి రవీందర్, పట్టణ అధ్యక్షుడు మిరియాల స్వామి, ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరై నూతన అధ్యక్షుడిగా చిలువేరు సుదర్శన్, ఉపాధ్యక్షులుగా ఆల్వాల వెంకయ్య, మిర్యాల రమాశంకర్, ప్రధాన కార్యదర్శిగా గంజి నరసింహారావు, సహాయ కార్యదర్శులుగా మిరియాల వీరేశం, మిరియాల కైలాసం, కోశాధికారిగా సింగం గిరిధర్‌లతో పాటు డైరెక్టర్లు చెరుపల్లి నరసింహ, సింగం వెంకటరమణ, దోర్నాల శ్రీను, కర్నాటి రాజు, చిలువేరు రాజశేఖర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన అధ్యక్షుడు చిలువేరు సుదర్శన్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి, చేనేత రంగం అభ్యున్నతికి అందరి సహకారంతో పాటుగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అవ్వారీ భాస్కర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు మిర్యాల మధుకర్, మార్కండేయ దేవాలయం అధ్యక్షుడు కొంగరి కృపానంద్, గౌరవ సలహాదారు సంగిశెట్టి పరమేశం, మారం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.