అణు యుద్ధం నుండి 30 మిలియన్ల మందిని కాపాడాను: డొనాల్డ్ ట్రంప్

Published on: 03 Jul 2026, 02:13 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్, వాషింగ్టన్, జూలై 3: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అప్పట్లో అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని, అయితే తన చొరవతో ఆ యుద్ధాన్ని ఆపి 30 మిలియన్ల ప్రాణాలను కాపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. అప్పట్లో ఆ దేశాల నేతలతో తాను ఫోన్ ద్వారా మాట్లాడి, వాణిజ్యపరమైన ఒత్తిడిని ఉపయోగించడం వల్లే అణు విపత్తు తప్పిందని ఆయన పేర్కొన్నారు. తాను శాంతిని నెలకొల్పడం వల్ల లక్షలాది మంది ప్రాణాలతో బయటపడ్డారని, పాకిస్థాన్ ప్రధాని సైతం ఆ క్రెడిట్ తనకే దక్కుతుందని అంగీకరించారని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.