అత్తతో అల్లుడి వికృత వివాహం.. ఒకరి కోసం ఒకరం పుట్టామంటూ కోర్టు మ్యారేజ్..

Published on: 08 Jun 2026, 04:26 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, నాగపూర్, జూన్ 08, 2026: సమాజం ఛీత్కరించుకునేలా, బంధుత్వాల విలువలను దిగజార్చే ఒక వికృత ఘటన నాగపూర్ దేహాత్ (రూరల్) పరిధిలో వెలుగుచూసింది. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక అత్త, అల్లుడితో కలిసి పెళ్లి పీటలెక్కింది. భార్యను (కూతురిని) వదిలేసిన అల్లుడు, భర్తను వదిలేసిన అత్త ఇద్దరూ కలిసి కోర్టులో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. అనంతరం తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. "మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం.. కానీ ఆ విషయం మాకు కాస్త ఆలస్యంగా తెలిసింది.. అందుకే ఈ జన్మలో ఒకటై జీవించాలని నిర్ణయించుకున్నాం" అంటూ ఆ వీడియోలో సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. పవిత్రమైన అత్తా-అల్లుళ్ల బంధానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ వింత వివాహ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని, విమర్శలను మూటగట్టుకుంటోంది.