అద్దె బాకీకి భార్య, కూతురు తాకట్టు.. కిరాతక భర్త దారుణం!

Published on: 16 May 2026, 11:07 AM
News Article
  • డబ్బుల్లేక ఇంటి యజమానికి అప్పగించిన పాపాత్ముడు
  • పోలీసుల రంగప్రవేశంతో వెలుగుచూసిన ఘోరం



హైదరాబాద్ న్యూస్ టైమ్, ఇంటర్నెట్ డెస్క్: అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేక ఓ వ్యక్తి తన భార్యను, మైనర్ కుమార్తెను ఇంటి యజమాని దగ్గరకు పంపేలా దారుణమైన డీల్ కుదుర్చుకున్న సభ్యసమాజం తలదించుకునే ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల క్రితం మోర్బి ప్రాంతానికి వలస వచ్చి, అక్కడ నెలకు రూ. 2,000 అద్దెతో నివాసం ఉంటోంది. అయితే ఆర్థిక సమస్యల వల్ల నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని గొడవ చేయగా, సదరు భర్త తాను డబ్బులు కట్టలేనని, అందుకు బదులుగా తన భార్యను, మైనర్ కూతురిని పంపిస్తానని ఒప్పందం కుదుర్చుకోగా, ఆపై యజమాని వారిద్దరిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఉదంతం గురించి బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నికృష్ణపు భర్తతో పాటు కామాంధుడైన ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు; అలాగే ఈ దారుణ నేరంలో ప్రమేయం ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.