అమర్‌నాథ్ యాత్రకు 'ఆపరేషన్ శివ'.. రంగంలోకి అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ!

Published on: 22 Jun 2026, 04:36 AM
News Article

శ్రీనగర్, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆర్మీ, భద్రతా బలగాలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి. 'ఆపరేషన్ శివ' (Operation Shiva) పేరుతో భారత సైన్యం ఈసారి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా యాత్రికులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సరికొత్త టెక్నాలజీతో కూడిన యాంటీ-డ్రోన్ వ్యవస్థతో భద్రతను కల్పించనున్నారు. ముఖ్యంగా ఉగ్రవాద ముప్పు ఉన్నట్లుగా భావిస్తున్న 55 సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ అత్యాధునిక యాంటీ-డ్రోన్ గన్‌లతో పాటు, పటిష్టమైన నిఘా పరికరాలను మోహరించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.