అమర్‌నాథ్ యాత్రకు కొనసాగుతున్న భక్తుల ప్రవాహం

Published on: 17 Jul 2026, 08:35 AM
News Article

జమ్మూ, జూలై 17, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి శుక్రవారం ఉదయం 16వ విడతగా 4,640 మంది భక్తుల బృందం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరింది. ఇప్పటివరకు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహాలయానికి 3.45 లక్షల మందికి పైగా భక్తులు చేరుకుని పరమశివుడిని దర్శించుకున్నారు. మొత్తం 171 వాహనాలతో కూడిన ఈ కాన్వాయ్‌లో, 1,626 మంది యాత్రికులు గందర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ మార్గం ద్వారా, 3,014 మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని సంప్రదాయ పహల్గామ్ మార్గం ద్వారా యాత్రను కొనసాగించనున్నారు.