ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్న‌ కార్య‌క‌ర్త‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి

Published on: 14 Aug 2026, 06:44 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 14, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఇటీవల ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కోమటిరెడ్డి వీరాభిమాని గడుసు శశిధర్‌రెడ్డిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. అలాగే, అనారోగ్యంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులను కూడా ఆయన పరామర్శించి, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కాంగ్రెస్ కార్యకర్తలకు, తన అభిమానులకు కష్టకాలంలో ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా తాము వ్యక్తిగతంగా అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా కల్పించారు