ఇషాన్ కిషన్ భావోద్వేగం!

Published on: 19 May 2026, 01:33 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్, స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించిన టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సోమవారం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవలే తన సోదరిని కోల్పోయి తీవ్ర పుట్టెడు శోకంలో ఉన్న తన కజిన్ కుటుంబ సభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారని, ఆ క్లిష్ట సమయంలో తాను ఆడిన ఇన్నింగ్స్‌ వెనుక "పైనున్న ఆ దేవుడి ఆశీస్సులు" ఉన్నట్లు భావిస్తున్నానని ఇషాన్ పేర్కొన్నాడు. కష్టకాలంలోనూ తన ఆటను ఆదరించేందుకు వచ్చిన కుటుంబ సభ్యుల ముందే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడటం తనకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఆ భగవంతుడే తనను నడిపించాడంటూ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు.