ఎనిమిదేళ్లుగా గొంతులో 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీ.. ఎలా బతికాడో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Published on: 19 Mar 2026, 11:23 AM
News Article
బీజింగ్: సర్జరీ అంటే భయం ఓ వ్యక్తిని ఎనిమిదేళ్ల పాటు నరకయాతన అనుభవించేలా చేసింది. చైనాకు చెందిన ఒక వ్యక్తి పొరపాటున 12 సెంటీమీటర్ల పొడవైన 'మెటల్ చాప్‌స్టిక్' (ఇనుప కడ్డీ వంటిది) మింగేశాడు. అయితే ఆపరేషన్ అంటే ఉన్న విపరీతమైన భయంతో, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గొంతులోనే ఆ ఇనుప ముక్కతో ఎనిమిదేళ్లు గడిపేశాడు. తిండి తినాలన్నా, నీళ్లు తాగాలన్నా నరకం కనిపిస్తున్నా భరిస్తూ వచ్చాడు. చివరికి పరిస్థితి విషమించడంతో వైద్యులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి, అత్యాధునిక 'మినిమల్లీ ఇన్వేసివ్' పద్ధతిలో రక్తం చుక్క చిందకుండా ఆ కడ్డీని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నాడు.