ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డిగూడెం కాంగ్రెస్ నూతన కమిటీ!
Published on: 10 Jul 2026, 02:22 PM
సంస్థాన్ నారాయణపురం, జూలై 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా నర్రి మల్లేష్, ఉపాధ్యక్షుడిగా మాచర్ల వినయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నర్రి ఎట్టయ్య, వార్డు సభ్యులు సిరిపంగి అందాలు కృష్ణ, బాతరాజు లాలు, ఆలయ చైర్మన్ వీరమల్ల స్వామి, వైస్ చైర్మన్ నర్రి స్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్రి రాజు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్రి ఐలయ్య, సీనియర్ నాయకులు జింకల మారయ్య, నెయ్యి స్వామి, కడ్తాల సాయిలు, కొండూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.