ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గుజ్జ సర్పంచ్ దంపతులు!
హైదరాబాద్, జూన్ 30 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామ సర్పంచ్ ఎర్ర కవిత సైదులు దంపతులు తమ వివాహ వార్షికోత్సవం (పెళ్లిరోజు) సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోందని, అలాగే వారి మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఆదుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎర్ర కార్తీక్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.