హైదరాబాద్, నవంబర్ 24, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నూతనంగా ఎన్నికైన సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీలో తమకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం సమష్టిగా కృషి చేస్తామని మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేసి, పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దోనూరి జైపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి దేప ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రం గౌడ్, కార్యదర్శి బొజ్జ అంజయ్య, ఉదావత్ పాండు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కత్తుల అశోక్, సిరిపంగి బాలకృష్ణ, కొల్లూరి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.