ఎమ్మెల్యే సామేలు క్షమాపణ చెప్పాలి: ఉబ్బు వెంకటయ్య డిమాండ్
లక్కారం, జూలై 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య డిమాండ్ చేశారు; సోమవారం లక్కారంలోని రాజగోపాల్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు.. దళితుల కార్డును అడ్డం పెట్టుకుని సామేల్ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీలు తెస్తున్నాడని, సొంత కుటుంబానికి పదవులు ఇప్పించుకుంటూ 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరించి మండల పదవులను అమ్ముకున్నాడని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.