ఏఐ వినియోగంపై ఆందోళన: పిల్లల్లో తగ్గుతున్న ఆలోచనా శక్తి!
Published on: 02 Jul 2026, 03:32 AM
హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నేటి తరుణంలో ఏఐ (AI) టూల్స్‌పై ప్రజలు అధికంగా ఆధారపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది, మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలను బాగా అర్థం చేసుకుంటుందని జనం భావిస్తుండగా, భారతీయులలో ఏఐ వినియోగం ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగి ఏకంగా 65 శాతానికి చేరిందని ‘భారత్ సర్వే ఫర్ ఎడ్‌టెక్–2025’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఏఐ వినియోగం భారీగా పెరుగుతుండటం విద్యావేత్తలను కలవరపెడుతోంది, ఈ సాంకేతికతపై మరీ ఎక్కువగా ఆధారపడటం వల్ల పిల్లల్లో స్వయంగా ఆలోచించే శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఈ గణాంకాలు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.