ఏపీలో గ్యాస్ కొరత లేదు..
Published on: 17 Mar 2026, 11:29 AM
పశ్చిమాసియా/ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే వదంతులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ (RTGS) వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పెట్రోలియం, గెయిల్, ఓఎన్జీసీ కంపెనీల ప్రతినిధులతో ఆయన పరిస్థితిని అంచనా వేశారు.
సరిపడా నిల్వలు: రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, రాబోయే 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు భయాందోళనలతో ముందస్తు బుకింగ్స్ (Panic bookings) చేసుకోవద్దని భరోసా ఇచ్చారు.
బ్లాక్ మార్కెట్‌పై నిఘా: గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ-కేవైసీ (e-KYC), ఓటీపీ (OTP) విధానాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వాటికి అంతరాయం కలగొద్దు: ఆసుపత్రులు, విద్యార్థుల హాస్టళ్లు, దేవాలయాలు, అన్నా క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి: గ్యాస్ కొరత భయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్‌ల (Induction Stoves) లభ్యతను పెంచాలని, వినియోగం తగ్గించేలా హోటల్ అసోసియేషన్లతో మాట్లాడాలని సూచించారు.
పైప్డ్ గ్యాస్ విస్తరణ: కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) నెట్‌వర్క్ ద్వారా నేరుగా ఇళ్లకు పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, సీఎన్జీ (CNG), పీఎన్జీ (PNG) వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.