కరుణానిధి వెనుక ఆ కుర్రాడు ఎవరో తెలుసా?

Published on: 05 May 2026, 02:48 PM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఒక పాత ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే దిగ్గజం ఎం. కరుణానిధి ఒక రిబ్బన్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో కరుణానిధి వెనుక చాలా సాదాసీదాగా నిలబడి ఉన్న ఒక చిన్న కుర్రాడు ఇప్పుడు తమిళనాడు రాజకీయ చిత్రపటాన్నే మార్చేశాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు.. నేటి తమిళ రాజకీయ సంచలనం, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్. ఈ ఫోటోలో విజయ్ తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, తల్లి శోభతో కలిసి ఉన్నారు. ఈ ఫోటోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) షేర్ చేస్తూ.. "తన వెనుక ఉన్న ఈ పిల్లాడు ఒకరోజు తన పార్టీనే ఓడిస్తాడని కరుణానిధి గారు కూడా ఊహించి ఉండరు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే కోటగా భావించే కొలత్తూరులో స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఓటమి పాలుకావడం గమనార్హం. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.