కళ్లలో కారం కొట్టి రూ.కోటి లూటీ!

Published on: 17 Mar 2026, 04:23 AM
News Article
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు పక్కా స్కెచ్‌తో సినీ ఫక్కీలో రెచ్చిపోయారు. ఏసీపీ ఆఫీస్ పక్కనే ఈ ఘటన జరగడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

వెంబడించి దాడి: రూ.కోటి నగదు ఉన్న బాక్సును కొందరు వ్యక్తులు బైక్‌పై తరలించే ప్రయత్నం చేశారు. వారిని ముందే గమనించిన దుండగులు మరో మూడు బైక్‌లపై వారిని ఫాలో అయ్యారు.

కళ్లలో కారం: నగదు కలెక్ట్ చేసుకుని వంద మీటర్లు కూడా వెళ్లకుండానే దుండగులు తమ ప్లాన్ అమలు చేశారు. డబ్బులు తరలిస్తున్న వారి కళ్లలో ఒక్కసారిగా కారం చల్లారు.

బాక్సుతో పరార్: కారం దెబ్బకు బాధితుల బైక్ అదుపుతప్పి కింద పడగానే, అమాంతం ఆ కోటి రూపాయల నగదు ఉన్న బాక్సును లాక్కుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

హవాలా కోణం..?: కూకట్‌పల్లి ఏసీపీ ఆఫీస్‌కు కూతవేటు దూరంలోనే ఈ సాహసోపేతమైన దోపిడీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, భారీ మొత్తంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తరలిస్తుండటంతో.. దోపిడీకి గురైన ఆ మొత్తం 'హవాలా డబ్బు' అయి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.