కాటేదాన్‌లో కల్తీ బేకరీ గుట్టు రట్టు!
Published on: 25 Mar 2026, 03:21 PM
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ఆహార కల్తీ మాఫియా పడగవిప్పింది. కాటేదాన్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక అక్రమ బేకరీ తయారీ యూనిట్‌పై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. "మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ" పేరుతో నిర్వహిస్తున్న ఈ యూనిట్‌లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఏం జరిగిందంటే?
- కుళ్ళిన గుడ్లు & కెమికల్స్: ఈ బేకరీలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకరమైన కెమికల్స్ (సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, PGPR లిక్విడ్) ఉపయోగిస్తూ డోనట్ బన్‌లు, కేకులు తయారు చేస్తున్నారు.
- ముగ్గురి అరెస్ట్: ఈ అక్రమ యూనిట్ నిర్వహిస్తున్న ఆఫ్రిది అన్సారీ (సూపర్ వైజర్), యాసిన్ (మేనేజర్), ఖత్రేషన్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- పిల్లల ప్రాణాలతో చెలగాటం: ఈ కల్తీ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తూ ప్రజల, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

- భారీగా సీజ్: పెద్ద మొత్తంలో కుళ్ళిన గుడ్లు, సింథటిక్ రంగులు, ఫ్లేవర్లు మరియు తయారీ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.