కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసి బస్సు బోల్తా, డ్రైవర్ మృతి
Published on: 04 Sep 2026, 08:08 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. అధిక వేగంతో వస్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న గార్డ్ వాల్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం బిచ్కుంద ఆసుపత్రికి తరలించారు.