కుంట్లూరు కురుమ సంఘం నూతన కార్యవర్గ నియామకం..

Published on: 26 Jul 2026, 02:02 PM
News Article

కుంట్లూరు, జూలై 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కుంట్లూరు కురుమ సంఘం బలోపేతం కోసం ఆదివారం సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సంఘం కార్యదర్శిగా చెరుకుపల్లి లింగం కురుమను, సహాయ కార్యదర్శిగా మాలిగా వెంకట సాయి కురుమను నూతనంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

పెద్ద కురుమ దడిగా కొమరయ్య కురుమ, సంఘం అధ్యక్షులు నీల జంగయ్య కురుమ, ప్రధాన కార్యదర్శి పల్లె మల్లేష్ కురుమ, కోశాధికారి కోడూరు అశోక్ కురుమ, ఉపాధ్యాయులు గుత్తి రమేష్ కురుమ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కంకల సత్తయ్య కురుమ, అచ్చిన శ్రీను కురుమ, బండ శంకరయ్య కురుమ, కార్యదర్శి శ్రీశైలం కురుమ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.