కుంట్లూర్‌లో వైభవంగా శ్రీశ్రీశ్రీ బీరప్పస్వామి, కమరాతిదేవి విగ్రహాల ప్రతిష్టాత్మక మహోత్సవం
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కుంట్లూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ బీరప్పస్వామి, శ్రీశ్రీశ్రీ కమరాతిదేవి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాత్మక మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ కురుమ సంఘం పెద్దల సమక్షంలో దేవాలయంలో నూతన లింగాల (విగ్రహాల) ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వేడుకకు కుంట్లూర్ గ్రామ కురుమ సంఘం పెద్దకురుమ దడిగ కొమురయ్య కురుమ, శేలోజీ కంకల సత్తయ్య కురుమ, సంఘం అధ్యక్షులు నీళ్ల జంగయ్య కురుమ, ప్రధాన కార్యదర్శి పల్లె మల్లేశం కురుమ, కోశాధికారి కోడూరి అశోక్ కురుమ, ఉపాధ్యక్షులు రావుల నరసింహ కురుమ, అచ్చిన శీను కురుమ తదితర కురుమ పెద్దలు, కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కురుమ కుల పెద్దలు మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఐక్యంగా ముందుకు సాగడంతో పాటు సమిష్టి కృషితో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.
ఈనెల 13న బోనాల పండుగ
కుంట్లూరు గ్రామంలోని కురుమ కులస్తుల ఆరాధ్య దైవాలైన శ్రీశ్రీశ్రీ బీరప్పస్వామి, కమరాతిదేవి దేవాలయంలో ఈనెల 13వ తేదీ ఆదివారం రోజున బోనాల పండుగను నిర్వహించనున్నట్లు కురుమ పెద్దలు ప్రకటించారు. ఈ పండుగలో ప్రతి కురుమ కులస్తుని ఇంట నుంచి ఒక్కో బోనం సమర్పించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుత్తి రమేష్ కురుమ, బండ శంకరయ్య కురుమ, కార్యదర్శులు నర్రి శ్రీశైలం కురుమ, కొత్తకుర్మ మల్లేష్ కురుమ, కొండే ప్రదీప్ కురుమ, బర్ల లింగస్వామి కురుమ, సహాయ కార్యదర్శులు పాలంచి రాజు కురుమ, మీస బాలరాజు కురుమ, మంగ కృష్ణ కురుమ, మంగ నరసింహ కురుమ, గౌరవ సలహాదారులు కప్పే రమేష్ కురుమ, అదే మల్లేష్ కురుమ, జమ్ము వీరభద్రం కురుమ, మరియు ఇతర కమిటీ సభ్యులు, కురుమ సంఘం పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.