కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Published on: 25 Jul 2026, 09:07 AM
News Article

న్యూఢిల్లీ, జూలై 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనలు, తీవ్ర ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. విద్యా రంగానికి సంబంధించి నెలకొన్న పరిణామాలు, వ్యతిరేకత నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.