కొండా సురేఖ బర్తరఫ్.. రాష్ట్ర ప్రభుత్వ కీలక ఉత్తర్వులు విడుదల!

Published on: 03 Sep 2026, 09:14 AM
News Article

హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాజకీయాల్లో ఊహించినట్టుగానే సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తక్షణమే తొలగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు ఇప్పటికే సిఫార్సు పంపినట్లు ప్రభుత్వం అధికారిక నోట్‌లో స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరికొన్ని కీలక నియామకాలను కూడా ప్రకటించింది. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో ఎస్. గడ్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు కొత్త వైస్ చైర్మన్‌గా నియమించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ జీ. సుధా రాణిని నియమిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.