సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 14, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామపంచాయతీలో శుక్రవారం మహిళా సంఘ భవన నిర్మాణంతో పాటు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు మంజూరు చేయించి గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు కొత్తగూడెం గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం గ్రామ సర్పంచ్ చెరుకుపల్లి బీరయ్య, ఉప సర్పంచ్ రాచకొండ సాలమ్మ, పంచాయతీ కార్యదర్శి గంగారం, వార్డు సభ్యులు నీళ్ల అరుణ, సురకంటి జనార్దన్ రెడ్డి, వివో అధ్యక్షురాలు పాక సత్తమ్మ, వట్టిపల్లి రాములమ్మ, రొమ్ముల జంగమ్మ, చెరుకుపల్లి రవణమ్మ, కొమ్ము మల్లేష్, గుదే మల్లేష్, చెరుకుపల్లి ముత్యాలు, అంతటి రాములు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.