కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బర్త్‌డే పార్టీకి వెళ్లి లాంగ్ డ్రైవ్‌లో ఇంటర్ విద్యార్థి మృతి
Published on: 13 Sep 2026, 01:45 PM
హైదరాబాద్, సెప్టెంబర్ 13, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్‌డే పార్టీ ముగించుకుని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం నియో పోలీస్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మరో ఎనిమిది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు గుర్తించారు. తమన్ వర్మ అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకల అనంతరం రాత్రి సమయంలో ఓఆర్‌ఆర్ పైకి లాంగ్ డ్రైవ్ కోసం వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.