కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ
Published on: 12 Aug 2026, 02:14 PM
చౌటుప్పల్, ఆగస్ట్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చౌటుప్పల్‌లో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పురపాలక సంఘం చైర్మన్ మోగుదల పావని రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, కో-ఆప్షన్ సభ్యులు పస్తాం గంగరాములు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులకు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూసుఫ్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.