గట్టుప్పలలో మేడే వారోత్సవాలు..

Published on: 01 May 2026, 11:12 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్ (నల్గొండ బ్యూరో): ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) 140వ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో సీపీఎం టౌన్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఎం టౌన్ కార్యదర్శి కర్నాటి సుధాకర్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.

చికాగో అమరవీరుల స్ఫూర్తితో..

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాడిన కార్మికుల రక్తంతోనే ఈ ఎర్రజెండా పుట్టిందని గుర్తుచేశారు. నాటి సామ్రాజ్యవాద ప్రభుత్వం కార్మికులపై జరిపిన కాల్పులు, వారి త్యాగాల ఫలితంగానే నేడు కార్మికులకు పని గంటల హక్కు లభించిందని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు:

నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, కార్మిక-కర్షక రాజ్యం రావాలని ఆయన పిలుపునిచ్చారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎండి రబ్బాని, కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ, ముసుగు బుచ్చిరెడ్డి, నల్లవెల్లి బిక్షం, చెన్నయ్య పాల్గొన్నారు. అలాగే ప్రజా సంఘాల నాయకులు దుబ్బాక శంకరయ్య, పసుపుల ఏడుకొండలు, కుక్కునూరు రాము, ఎరుపుల సైదులు, గంట నరసింహ, బొబ్బలి చంద్రయ్య, కర్నాటి యాదయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.