గర్డాసిల్ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ ముప్పును ఎదుర్కొందాం

Published on: 12 Aug 2026, 02:17 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న 'గర్డాసిల్ 9' (GARDASIL 9) వ్యాక్సిన్‌ను తాను స్వయంగా తీసుకున్నట్లు చౌటుప్పల్‌కు చెందిన డీ. శాన్వి తెలిపారు. అలాగే వైద్యురాలు డాక్టర్ ప్రశాంతి సలహా మేరకు తన తమ్ముడు సన్వీర్‌కు 'గర్డాసిల్ 4' వ్యాక్సిన్ వేయించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణ, వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన సందేశం అందించారు. ప్రజలు ఎవరికి వారు ఆరోగ్య పరిస్థితి, వయస్సును బట్టి వైద్యుల సూచనల మేరకు అర్హత ఉంటే వెంటనే ఈ వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆమె కోరారు. సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకుని టీకాలు వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్యులు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుందాం, వ్యాక్సినేషన్‌తో ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ముందడుగు వేద్దామని డి. శాన్వి, డి. సన్విర్, డాక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు.