ఘనంగా ఉడుగు రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

Published on: 12 Aug 2026, 05:01 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఉడుగు రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలను చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌కు శాలువా కప్పి, కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితులు మాట్లాడుతూ.. కల్మషం లేని వ్యక్తిత్వం, ప్రజల మేలు కోరే మనస్తత్వం, మచ్చలేని నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప వ్యక్తి రమేష్ గౌడ్ అని కొనియాడారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దెప రాజు, సుర్వి నరసింహ, దాడి యశ్వంత్, చారి, లింగస్వామి తదితర స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.