ఘనంగా ఎడ్ల రామిరెడ్డి జన్మదిన వేడుకలు

Published on: 04 Aug 2026, 03:34 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - చౌటుప్పల్): చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎడ్ల రామిరెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్నేహితులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సంస్థాన్ నారాయణపురం శ్రీ కంఠమహేశ్వర దేవస్థానం అధ్యక్షులు రాపర్తి కరుణాకర్ గౌడ్, పగిళ్ల భాస్కర్ రెడ్డి, యాట రమేష్, నెల్లికంటి సుదీప్ కుమార్, ఎల్లంకి వెంకటేష్ గౌడ్, కస్తూరి లింగస్వామి, చింతల కృష్ణ, చిలువరి శివకుమార్, పాపగళ్ల మహేష్, చిన్ని కృష్ణ, పిట్ట రమేష్, రాచకొండ మనోజ్ తదితర స్నేహితులు, అభిమానులు పాల్గొని రామిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.