ఘనంగా కడపగండి తండా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ జన్మదిన వేడుకలు
సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడపగండి తండా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కరంటోత్ గోవర్ధన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేఘావత్ రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవర్ధన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, గోవర్ధన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడపగండి తండా సర్పంచ్ రాము నాయక్, గంగమూల సర్పంచ్ లచ్చు నాయక్, వాచ్యతండా సర్పంచ్ శోభ సుధాకర్ నాయక్, కడపగండి తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చా నాయక్, కడపగండి తండా 6వ వార్డు మెంబర్ నవీన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు గణేష్ నాయక్, కడపగండి తండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజు నాయక్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మెరుగు గిరి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొండ నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు కోల మహేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.