ఘనంగా దోనూరు జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - సంస్థాన్ నారాయణపురం): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దోనూరు జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి జైపాల్ రెడ్డికి శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనతో కేక్ కట్ చేయించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పబ్బు రాజు గౌడ్, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్, నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, మల్లారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్రి మల్లేశం, గిరి, శేఖర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.