ఘనంగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్‌గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published on: 09 Aug 2026, 02:13 PM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 9, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - సంస్థాన్ నారాయణపురం): సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్‌గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నారాయణపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండల యువజన కాంగ్రెస్ కమిటీ నాయకులు మరియు మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిస్వార్థంగా మసలుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్‌గోపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ప్రజా సేవ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.