చిల్లాపురం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మేకల రమేష్ ఏకగ్రీవ ఎన్నిక

Published on: 26 Aug 2026, 03:01 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో చిల్లాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మేకల రమేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా బండి అశోక్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. తమను ఎన్నుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మండల అధ్యక్షులు శ్రీను నాయక్‌కు మరియు పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లేందుకు సైనికులా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి, భిక్షపతి నాయక్, కుక్కల నరసింహ, చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిచ్చ నాయక్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రాజు, పర్సగోని నరసింహ, వార్డు మెంబర్ లింగంపల్లి రవి, మేకల వెంకటయ్య, బండి యాదయ్య, కరంటోతు బిక్కు నాయక్, మెరుగు జంగయ్య, దుబ్బాక అనిల్, బద్దుల యాదయ్య, లింగంపల్లి రాజు, లింగంపల్లి జలంధర్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.