చిల్లాపురం కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ ఏకగ్రీవ ఎన్నిక

Published on: 25 Aug 2026, 06:22 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిల్లాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల ప్రత్యేక సమీక్షా సమావేశంలో ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టారు. ఉపసర్పంచ్ లింగంపల్లి పుష్పలత జలంధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఘనంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ వివరాలు:

  • అధ్యక్షులు: బండి అశోక్
  • కార్యదర్శి: కొప్పు కిరణ్
  • ఉపాధ్యక్షులు: సూర శంకరయ్య
  • ప్రధాన కార్యదర్శి: లింగంపల్లి జంగయ్య
  • కార్యవర్గ సభ్యులు: పెట్టుగల శేఖర్, పర్సగొని యాదగిరి, లింగంపల్లి రాములు, మేకల యాదగిరి, కొప్పు యాదగిరి.

ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు మెరుగు పెద్ద జంగయ్య, బండి యాదయ్య, పర్సగోని యాదయ్య, పర్సగొని నరసింహ, సూరు శంకరయ్య, లింగంపల్లి జలంధర్, మేకల యాదగిరి, బండి ముత్తయ్య, లింగంపల్లి రాములు, పెట్టుగల శేఖర్, లింగంపల్లి నరసింహ, లింగంపల్లి వెంకన్న, లింగంపల్లి శ్రీరాములు, బండి రవి, శేఖర్, రామకృష్ణ, సూరు బాబు, కుక్కల మహేష్, కొప్పు కిరణ్, యాదగిరి, మహేందర్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.