చేనేత చీరపై అద్భుత కళాఖండాన్ని సృష్టించిన నేత‌న్న‌

Published on: 28 Jul 2026, 03:53 PM
News Article
గట్టుప్పల, జూలై 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్స్):
నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన చెరిపల్లి రాజు మరియు తండ్రి రాములు చేనేత హస్తకళతో అబ్బురపరిచే అద్భుతాన్ని సృష్టించారు. ఒకే చీరలో దేవుని గోపురం, నెమలిపై సుబ్రహ్మణ్య స్వామి, అఖండ జ్యోతి, ఏనుగులు, గుర్రాలు, గుట్ట వంటి పలు అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దారు. ఒకే చీరపై ఇన్ని రకాల చేనేత కళలను సృష్టించడం అత్యంత అరుదని, కేవలం కొద్దిమందికే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ అద్భుతమైన చీర తయారీ కోసం దాదాపు 30 రోజులు శ్రమించినట్లు రాజు పేర్కొన్నారు. ఈ వినూత్న చేనేత కళా సృష్టిని తిలకించిన స్థానికులు, పలువురు ప్రముఖులు రాజును ఘనంగా అభినందించారు.