చేనేత సంఘం నూతన కమిటీకి సన్మానం: శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ విజయలక్ష్మి!

Published on: 12 Jul 2026, 01:01 PM
News Article

సంస్థాన్ నారాయణపురం, జూలై 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల చేనేత సహకార సంఘం ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన బాధ్యులను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పగిడిమర్రి విష్ణు, కార్యదర్శిగా దోర్నాల అంజయ్య, కోశాధికారిగా సంగిశెట్టి అనంతలతో పాటు డైరెక్టర్లు వంగరి రఘు, మేకని యాదగిరి, దువ్వ విజయలక్ష్మి, సూరపల్లి రాములు, గోశిక స్వామిలను సత్కరించి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు నూతన కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలని సర్పంచ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ, కాంగ్రెస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, సీనియర్ నాయకులు రాచకొండ రమేష్ బాబు, గునిగంటి రాజు గౌడ్, బద్దుల మురళి యాదవ్, మారగోని శంకర్ గౌడ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.