చౌటుప్పల్ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
చౌటుప్పల్, జూలై 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థాన మాతృ సంస్థ ఆధ్వర్యంలోని చేనేత సహకార సంఘానికి నూతన పాలకమండలి ఎన్నికైంది. ఎన్నికైన నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా బడుగు మోహన్ బాబు, ఉపాధ్యక్షులుగా గోశిక శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కాటబత్తిని భీమయ్య, కోశాధికారిగా బడుగు సావిత్రి బాధ్యతలు స్వీకరించారు. అలాగే సభ్యులుగా గోశిక నరసింహ, గోశిక లక్ష్మీపతి, దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ, బత్తుల మానస ఎన్నికయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, టిడిపి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ బడుగు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, సంఘం మాజీ అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, గోశిక చక్రపాణి, దేవస్థానం బాధ్యులు బడుగు శ్రీరాములు, బడుగు జయప్రకాష్, పలువురు చేనేత పారిశ్రామికులు, అభిమానులు పాల్గొన్నారు.