చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Published on: 15 Aug 2026, 04:20 AM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 15, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. దేశ సేవలో పోలీసుల బాధ్యత, క్రమశిక్షణ మరియు ప్రజల భద్రత కోసం నిరంతరం అంకితభావంతో విధులు నిర్వర్తించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటారు.