చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలకు మరియు మహిళా లోకానికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు గూగులోతు అరుణ శంకర్ నాయక్ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంగిలిపూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకోవడం మన ఆచారమని తెలిపారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను, ఆనందాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఇంట్లో సిరులు కురవాలని ఆమె ఆశీస్సులు అందజేశారు.