చౌటుప్పల్ ఫోటో మ‌రియూ వీడియోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడిగా సుక్క స్వామి ఎన్నిక

Published on: 12 Aug 2026, 02:13 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 12, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోజు యజ్ఞమాచారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, సంఘం అధ్యక్షుడిగా సుక్క స్వామి, గౌరవ అధ్యక్షులుగా తోర్పునూరి సాయిలు గౌడ్, చింతల గణేష్, భారత మధు, వరగంటి వెంకటేష్, నందగిరి పరమేష్, జక్క చలమంద రెడ్డి, బోడిగే ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా ఎర్ర శివ, వరికుప్పల మహేష్, ప్రధాన కార్యదర్శిగా వనం రుషి, కోశాధికారిగా రోషణ గారి రాఘవేంద్ర గౌడ్, సహాయ కార్యదర్శిగా పల్లెర్ల సుజిక్, ప్రచార కార్యదర్శిగా పగడాల శంకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా మలిగె రవి, పగిళ్ల మహేష్, డాకోజీ వెంకట శివకుమార్, జాజుల రామకృష్ణ, పెడకంటి నాగేంద్ర లు ఎన్నికయ్యారు.