చౌటుప్పల్‌లో దివిస్ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ల ప్రారంభం

Published on: 01 Jul 2026, 12:56 PM
News Article

చౌటుప్పల్, జూలై 01 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ మరియు 13వ వార్డులలో దివిస్ కంపెనీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, దివిస్ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వీటి ద్వారా స్థానిక వార్డు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మున్సిపాలిటీ ప్రధాన ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని వార్డులలో కూడా ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్ పస్తం గంగరాములు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.