ఛత్తీస్‌గఢ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.!
Published on: 25 Mar 2026, 03:25 AM
బాలాస్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (Avian Influenza) పంజా విసిరింది. కోని ప్రాంతంలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో గత ఐదు రోజుల్లోనే (మార్చి 19 - 24 మధ్య) సుమారు 4,400 కోళ్లు మృతి చెందాయి.
ప్రభుత్వ చర్యలు:
- నమూనాల పరీక్ష: చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్, పుణెలోని ల్యాబ్‌లకు పంపగా.. బర్డ్ ఫ్లూ ఉన్నట్లు ధృవీకరించాయి.
- రెడ్ జోన్ ప్రకటన: కోళ్ల ఫారం చుట్టూ 1 కి.మీ పరిధిని 'ఇన్‌ఫెక్టెడ్ జోన్'గా, 10 కి.మీ పరిధిని 'సర్వైలెన్స్ జోన్'గా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ప్రకటించారు.
- నిషేధం: బాధిత ప్రాంతంలో కోళ్లు, గుడ్లు, పక్షి దాణా రవాణాపై పూర్తి నిషేధం విధించారు. మిగిలిన కోళ్లను శాస్త్రీయంగా నిర్మూలించే (Culling) ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
భయాందోళన వద్దు:
ప్రస్తుతానికి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని కోరారు.