జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ షాక్..
Published on: 09 Apr 2026, 05:54 AM
హైదరాబాద్: ఏప్రిల్ 09 (హైదరాబాద్ న్యూస్ టైమ్) సామాన్యులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మోసగాడి చేతిలో మోసపోయారు. "వికసిత్ భారత్" పథకం పేరుతో నమ్మబలికిన ఓ కేటుగాడు.. అర్హుల జాబితా పంపిస్తే ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యేను నమ్మించాడు. ప్రాసెసింగ్ ఫీజు కింద 40 మందికి కలిపి ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం రూ. లక్ష రూపాయలను ఎమ్మెల్యే తన ఫోన్ పే ద్వారా పంపించారు. అయితే నిందితుడు మళ్లీ డబ్బులు అడగడంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే విచారించగా, అది మోసమని తేలింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.