జబర్దస్తు కొమురక్కపై.. దాడి అసలు నిజం ఇదేనా?
Published on: 02 Apr 2026, 03:15 AM
మహబూబ్‌నగర్: ప్రముఖ టీవీ షో 'జబర్దస్త్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొమురక్క పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
అభిమానులమంటూ ఆమె ఇంటికి వచ్చిన ఎనిమిది మంది యువకులు, ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించారు. కొమురక్కతో పాటు ఆమె సోదరుడిపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కొమురక్కకు తీవ్ర గాయాలయ్యాయి.
దాడికి కారణం ఇదేనా?
పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
- కొంతకాలం క్రితం కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది.
- ఈ దొంగతనంపై తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను కొమురక్క నిలదీశారు.
- దీంతో మనస్తాపం చెందిన శ్రీనాథ్, తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన కొమురక్క ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.